Mobile Popup Ad
Mobile Popup Ad

ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూ.. భట్టి ఘన నివాళి

కలం, ఖమ్మం బ్యూరో: నవ భారత నిర్మాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. నెహ్రూ 62వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. భారతదేశాన్ని కేవలం వ్యవసాయ ఆధారిత సమాజంగానే కాకుండా, పరిశ్రమలు, సాంకేతిక విజ్ఞానంతో కూడిన ఆధునిక దేశంగా తీర్చిదిద్దాలని నెహ్రూ కలలుగన్నారని కొనియాడారు.

​దేశ ప్రగతికి బాటలు వేసేలా భారీ ఆనకట్టలు, విద్యుత్ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాల స్థాపనకు ఆయనే శ్రీకారం చుట్టారని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గుర్తుచేశారు. సాంకేతిక, వైద్య, నిర్వహణ రంగాలలో దేశాన్ని ముందంజలో ఉంచేందుకు ఐఐటీ, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను నెలకోల్పడంతో పాటు, అంతరిక్ష రంగంలో నేడు భారత్ సాధిస్తున్న విజయాలకు నెహ్రూ వేసిన స్పేస్ రీసెర్చ్ పునాదులే కారణమన్నారు. అలాగే, దేశాన్ని అణ్వాయుధ సంపన్న దేశంగా మార్చేందుకు అవసరమైన అణుశక్తి మిషన్‌ను ఏర్పాటు చేసి, దేశ రక్షణకు ఆయన శక్తివంతమైన పునాది వేశారని కొనియాడారు.

​భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత యొక్క అసలైన బలమని నెహ్రూ బలంగా విశ్వసించారని అన్నారు. ఆ విలువలకు కట్టుబడి రాజ్యాంగ బద్ధమైన న్యాయవ్యవస్థలను అనుసరిస్తూ దేశాన్ని ఒక బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిపారని పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు అంజలి ఘటించారు.

Read Also: తెలంగాణ ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>