కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad), తుర్కయాంజల్ కమ్మగూడకు చెందిన దివ్యాంగుడు సునీల్ పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరిపైనా ఆధారపడకుండా, స్వశక్తితో ఎదగాలనే సంకల్పంతో ఏడాది కాలంగా బతుకుపోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో మూడు చక్రాల సైకిల్‌పై కూరగాయలను విక్రయిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. శారీరక వైకల్యాన్ని సైతం లెక్కచేయడం లేదు. నిరంతరం శ్రమిస్తూ జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ చిన్న పనికైనా సాకులు వెతికే నేటి యువతకు కష్టపడే తత్వం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. స్థానిక ప్రజల మనసులను గెలుచుకోవడమే కాకుండా ఎందరికో కొండంత స్ఫూర్తినిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడి వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

