కలం, వెబ్ డెస్క్ : అక్కినేని వారసుడు, యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఓ అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన, తన కుటుంబానికి దశాబ్దాలుగా వీరాభిమానిగా ఉన్న ఒక వృద్ధుడిని ప్రత్యేకంగా కలిసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సాధారణంగా సెలబ్రిటీలను కలవాలంటే అభిమానులు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ, తనపై ఎంతో కాలంగా అభిమానాన్ని చూపిస్తున్న ఒక సీనియర్ ఫ్యాన్ గురించి తెలుసుకున్న అఖిల్, స్వయంగా వెళ్లి ఆయనను కలవడం విశేషం. ఈ సందర్భంగా ఆ అభిమాని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అఖిల్ అక్కినేని (Akhil Akkineni), ఆయనతో కాసేపు సరదాగా గడిపారు.
తన అభిమాన హీరో తన ఇంటికే వచ్చి కలవడంతో ఆ సీనియర్ అభిమాని ఆనందానికి అవధులు లేవు. అక్కినేని నాగేశ్వరరావు గారి కాలం నుండి తమ కుటుంబం చూపిస్తున్న ప్రేమను అఖిల్ గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


