కలం వెబ్ డెస్క్ : కల్కి(Kalki) మూవీ ఓ సంచలనం. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. కల్కి 2(Kalki 2) నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) తప్పుకున్న విషయం తెలిసిందే. మరి.. కల్కి 2 లో నటించే బ్యూటీ ఎవరు..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కొంతమంది హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ దీపిక ప్లేస్ లో నటించే బ్యూటీ ఎవరు..?
దీపికా కల్కి 2 నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించినప్పటి నుంచి.. ఆమె పాత్రలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే.. మహేష్, రాజమౌళిల క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో ప్రియాంకా చోప్రా నటిస్తుంది. ఆతర్వాత కల్కి 2 లో నటిస్తే.. క్రేజ్ పరంగా కూడా సినిమాకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారట మేకర్స్. అయితే.. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ కావచ్చు. 2027లో వారణాసి రిలీజ్. అప్పటి వరకు ప్రియంకా బిజీగానే కాబట్టి.. ఆమె కల్కి 2 లో నటించడం కష్టమే అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.
ప్రియంకా సెట్ కాకపోతే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్(Mrunal Thakur) అయితే.. ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అనుకుంటున్నారట మేకర్స్. అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే.. కృతి సనన్.. ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీలో నటించడం.. ఆ మూవీ వర్కవుట్ కాకపోవడంతో.. సెంటిమెంట్ ప్రకారం ఆమెకు ఛాన్స్ ఉండకపోవచ్చు అని టాక్. తాజాగా అనుష్క(Anushka) పేరు తెర పైకి వచ్చింది. ప్రభాస్, అనుష్క మధ్య అనుబంధం గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి నటించిన మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేశాయో చూశాం. అందుకనే.. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే.. కల్కి 2 కు మరింత క్రేజ్ రావడం ఖాయం. ఆ దిశగానే నాగ్ అశ్విన్ ఆలోచిచేస్తున్నాడేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దీపికా ప్లేస్‌ను భర్తీ చేసే హీరోయిన్ ఎవరు అనేది మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఏది ఏమైనా.. కల్కి 2 హీరోయిన్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.


