ఫెయిల్ అవుతానని భ‌యంతో సూసైడ్.. ఫలితాలు చూస్తే షాక్‌..!

కలం, ఖమ్మం బ్యూరో: ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవుతాన‌న్న‌ భ‌యంతో ఓ ఇంట‌ర్‌ విద్యార్థి ఫ‌లితాల‌కు ముందే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. చివ‌ర‌కు ఇంటర్ ఫ‌లితాలు (Inter Results) వ‌చ్చాక చూస్తే అంతా షాక‌య్యారు. ఆ విద్యార్థి అన్ని స‌బ్జెక్టుల్లో పాస‌య్యాడు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ఖ‌మ్మం (Khamman) జిల్లాలోని బోన‌క‌ల్లు మండ‌లం రాప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గంగ‌దేవుల అక్షాంత్ ఇటీవ‌ల ఇంట‌ర్ ఫస్ట్ ఇయర్ ప‌రీక్ష‌లు రాశాడు. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవుతాన‌న్న భ‌యంతో గ‌త గురువారం మ‌ధిర రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో అక్షాంత్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేడు ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఫలితాల్లో అక్షాంత్‌ 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫ‌లితాలు వ‌చ్చే దాకా ఎదురుచూడ‌కుండా ఫెయిల్ అవుతాననే భయంతో క్షణికావేశంలో ఆ విద్యార్థి తీసుకున్న నిర్ణయంతో కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు గ్రామ‌స్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Read Also: యాంకర్ విష్ణుప్రియకు షాక్​.. కేసు నమోదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>