కలం, వెబ్ డెస్క్ : రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ (Dhurandhar) మూవీ రికార్డులు సృష్టిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా ఈ సినిమా హిందీలో పుష్ప 2 కలెక్షన్లను బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2 మూవీ బాలీవుడ్ లో రెండో శుక్రవారం వరకు రూ.27.50 కోట్లు కలెక్ట్ చేసింది. ధురంధర్ రెండో శుక్రవారం నాటికి రూ.34.70 కోట్లు కలెక్ట్ చేసింది. యానిమల్, చావా సినిమాలను కూడా ధురంధర్ దాటేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.550 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.
పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఇండియా జరిపే సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ ఈ సినిమా తీశారు. ఇందులో రణ్ వీర్ సింగ్(Ranveer Singh) పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు వస్తున్నాయి. మాధవన్ ఐబీ చీఫ్ గా, అక్షయ్ ఖన్నా విలన్ గా నటించారు. ధురంధర్(Dhurandhar) ను ఆరు గల్ఫ్ దేశాలు బ్యాన్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండియాలో రిలీజ్ చేసిన అన్ని ఏరియాల్లో మంచి టాక్ తో దూసుకుపోతోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: X(Twitter)


