epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం.. ఖమ్మం జిల్లాలో ఘర్షణ

కలం, వెబ్‌డెస్క్: రెండో విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat Polls) ఉత్సాహంగా సాగుతున్నాయి. పలు చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ సీపీఎం కార్యకర్తల మధ్య (Congress vs CPM) ఘర్షణ చోటు చేసుకున్నది. సీపీఎం అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండటం గమనార్హం. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ముదిగొండ(Mudigonda) పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపూర్ లో ఉద్రిక్తత నెలకొన్నది. ఇతర గ్రామాలకు చెందిన వారు ఊర్లో ప్రచారం చేస్తున్నాంటూ కొందరు గ్రామస్థులు ఆరోపించారు.

నిలిచిపోయిన పోలింగ్

రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Polls) వనపర్తి జిల్లా చిమనగుంట్ల పల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. ఓ వార్డుకు సంబంధించిన అభ్యర్థి గుర్తు లేకపోవడంపై అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 53 ఓట్లు పోలైన తర్వాత పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. ఈ వార్డుకు అవసరమైతే రీపోలింగ్ జరుపుతామని పేర్కొన్నారు. సమయాన్ని పెంచుతామన్నారు.

Read Also: సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి.. డబ్బులు పంచుతున్నారంటూ నిరసన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>