కలం, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది (Pak Terrorist) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఢిల్లీని ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించాడు. ఢిల్లీ(Delhi)ని ఆక్రమిస్తాం అని అర్థం వచ్చేలా.. ఆ నగరాన్ని పెళ్లికూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో భారత వైమానిక దళంపై కూడా నోరుపారేసుకున్నాడు. టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్(Abdul Rauf) ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రవూఫ్, లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అత్యంత సన్నిహితుడు. పాక్ ఆర్మీ అతడిని సాధారణ పౌరుడిగా పేర్కొంది. కానీ అతడిని భారత్ ఉగ్రవాదిగా పరిగణిస్తోంది. ఇటీవల రవూఫ్ భారత్‌పై అనేక సార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్‌పై దాడులు చేయాలంటూ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజా ప్రసంగంలో అతడు మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో సాయుధపోరాటం తగ్గిపోయిందనే వాదనలను కొట్టిపారేశాడు. వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు. ఎల్ఐటీ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ రెహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ.. భారత రాజధాని (Delhi ని ఉద్దేశిస్తూ)ని స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యమన్నాడు.
భారత సైనిక శక్తిపై కూడా రవూఫ్ నోరుపారేసుకున్నాడు. రఫేల్ యుద్ధవిమానాలు, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్‌లు అసమర్థమైనవిగా అభివర్ణించాడు. భారత వైమానిక దళం.. పాక్ గగనతలంలోకి ప్రవేశించే ధైర్యం చేయదని వ్యాఖ్యానించాడు. ఇస్లామిక్ దేశాల్లో పాక్ వద్ద మాత్రమే అసలైన అణ్వాయుధాలు ఉన్నాయన్నాడు.
Read Also: లెక్కల పాఠం చెప్పిన ‘బండి’
Follow Us On: X(Twitter)


