కలం, వెబ్ డెస్క్ : రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద దండయాత్రను కొనసాగిస్తోంది. జియో స్టూడియోస్ & B62 స్టూడియోస్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ క్రమంలోనే ధురంధర్ (Dhurandhar) ఫ్రాంచైజీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 3000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి భారతీయ ఫిల్మ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది. మరే ఇతర ఇండియన్ ఫ్రాంచైజీ మూవీ కూడా ధురంధర్ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ‘బహుబలి’, ‘పుష్ప’ ఫ్రాంచైజీ రికార్డులను దాటేసి ధురంధర్ ఈ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ‘బహుబలి’ కి రూ. 2,438 కోట్లు ( ‘బహుబలి’ రూ.650 కోట్లు, ‘బహుబలి 2’ రూ.1788 కోట్లు) రాగా.. పుష్ప కి రూ. 2,092 కోట్లు ( ‘పుష్ప 1’ – రూ. 350 కోట్లు, ‘పుష్ప 2’ – రూ. 1,742 కోట్లు ) వచ్చాయి.
వాస్తవానికి ‘ధురంధర్’ (Dhurandhar) విడుదలకు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. తొలి భాగం 2025 డిసెంబర్ 5న విడుదలైన వేళ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేసింది. కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టడంతో తొలి పార్ట్ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.1307 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. 3 నెలల వ్యవధిలో రెండో పార్ట్ విడుదల కాగా.. ‘ధురంధర్ 2’ ఇప్పటివరకు రూ.1,763 కోట్లను రాబట్టింది. అంతేకాదు భారతదేశంలో నెట్ వసూళ్ల పరంగా రూ.1000 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది.
Read Also: అసలైన నిద్ర రహస్యం అదే.. ఆలియా భట్ ప్రశ్నకు సద్గురు సమాధానం!
Follow Us On: Instagram

