Mobile Popup Ad
Mobile Popup Ad

అంబేద్కర్ అందరివాడు: సిరిసిల్ల రాజయ్య

కలం, వరంగల్ బ్యూరో : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్​ అందరివారని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య (Sirisilla Rajaiah), వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎండీ రియాజ్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాథోడ్ రమేశ్​, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్‌డీవో మేన శ్రీను, మెప్మా పీడీ జోనా, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, డీడబ్ల్యూవో విశ్వజ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, మహనీయుల ఉత్సవ కమిటీ ఛైర్మన్ బండారి సురేందర్, నాయకులు మంద కుమార్, పుట్ట రవి, అంకెశ్వరపు రామచంద్రరావు, చుంచు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Read Also: జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం: రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>