అసలైన నిద్ర రహస్యం అదే.. ఆలియా భట్ ప్రశ్నకు సద్గురు సమాధానం!

కలం, వెబ్ డెస్క్: నిద్ర (Sleep) విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలుంటాయి. ఎన్ని గంటల నిద్రపోవాలి? ఎప్పుడు నిద్రలేవాలి? లాంటి విషయాలు తరచుగా చర్చకొస్తుంటాయి. సరిగ్గా ఇదే విషయమై బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt), ఆధ్యాత్మిక గురువు సద్గురు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. 9 గంటలపాటు నిద్రపోయినా ఇంకా అలసటగా ఎందుకు అనిపిస్తుందని ఆలియా భట్ అడిగిన ప్రశ్నకు, సద్గురు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. నిద్ర అనేది కేవలం గంటల లెక్కకు సంబంధించింది కాదని, శరీరానికి అవసరమైన విశ్రాంతి స్థాయిని బట్టి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

మనం రోజంతా చేసే పనులు, ఆహారపు అలవాట్లు, మనస్సు స్థితి నిద్ర నాణ్యతను నిర్ణయిస్తాయని వివరించారు. సరైన పద్ధతిలో జీవిస్తే శరీరానికి తక్కువ నిద్రతోనే ఎక్కువ శక్తి లభిస్తుందని సద్గురు (Sadhguru) చెప్పారు. అతిగా నిద్రపోవడం వల్ల శరీరం మందగించి, ఉత్సాహం తగ్గే ప్రమాదం ఉందని సద్గురు స్పష్టం చేశారు. నిద్ర కోసం సమయం కేటాయించడం కంటే, మెలకువగా ఉన్నపుడే శరీరాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటున్నామనేది నిద్ర అవసరాన్ని తగ్గిస్తుందన్నారు. సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా నిద్ర సమయం కంటే విశ్రాంతి స్థాయిని మెరుగుపర్చుకోవడమే అసలైన ఆరోగ్య రహస్యమని సద్గురు చెప్పారు.

Read Also: డేటింగ్ సమయంలో పార్ట్‌నర్‌ను అడగాల్సిన 6 ప్రశ్నలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>