కలం, వెబ్ డెస్క్ : భారతీయ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2′(Dhurandhar 2) ప్రభంజనం సష్టిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. జియో స్టూడియెస్ & బీ 62 స్టూడియెస్ నిర్మించిన ఈ మూవీ మూడవ వారం ముగిసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా అక్షరాలా రూ.1,680 కోట్లను కొల్లగొట్టింది. అంతేకాదు ఇండియాలోనే ఈ మూవీ రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. తద్వారా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా ఈ మూవీ చరిత్రకెక్కింది.
‘ధురంధర్ 2’ కంటే ముందు కూడా రూ.895 కోట్ల కలెక్షన్లతో ధురంధర్ తొలి పార్ట్ ఈ జాబితాలో టాప్ లో ఉండేది. ధురంధర్ ప్రాంఛైజీల తర్వాతి స్థానాల్లో జవాన్ ( రూ. 643 కోట్లు), స్త్రీ 2 ( రూ.627 కోట్లు),ఛావా( రూ. 616 కోట్లు) టాప్ 5 లో ఉన్నాయి. కాగా, ఈ మూవీ నాలుగో వారంలోకి అడుగపెడుతున్నా.. సినిమాకు థియేటర్ల వద్ద డిమాండ్ తగ్గకపోవడం విశేషం. మౌత్ టాక్ బలంగా ఉండడం, రిపీట్ అడియెన్స్ పెరగుతుండడంతో రానున్న రోజుల్లో ఈ మూవీ భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమనిస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) దూకుడు ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాలి.
Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు
Follow Us On : WhatsApp

