Mobile Popup Ad
Mobile Popup Ad

జార్ఖండ్ టీ20 లీగ్ షురూ.. ధోనీ రాకతో పెరగనున్న జోష్!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ తరహాలో భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన తొలి జార్ఖండ్ టీ20 క్రికెట్ లీగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్సీఏ) బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ మెగా ఈవెంట్ ప్రారంభోత్సవ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తన పాటలతో అలరించనున్నారు. ఈ లీగ్‌లో చోటానాగ్‌పూర్ రాయల్స్, రాంచీ టైటాన్స్, కోయ్లాంచల్ సూపర్ కింగ్స్, జంషెడ్‌పూర్ స్టీలర్స్, ధన్‌బాద్ డైమండ్స్, సంతాల్ స్ట్రైకర్స్ అనే ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటానాగ్‌పూర్, రాంచీ జట్ల మధ్య తొలి మ్యాచ్, ఆ తర్వాత కోయ్లాంచల్, జంషెడ్‌పూర్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో ప్రతిరోజూ రెండు మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 24 లీగ్ మ్యాచ్‌ల తర్వాత, జూన్ 22న రెండు సెమీఫైనల్స్, జూన్ 23న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. అయితే, భారత జట్టు షెడ్యూల్స్ వల్ల స్టార్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, అనుకుల్ రాయ్ ఈ టోర్నీకి దూరం కావడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఈ మ్యాచ్‌లన్నీ జియో హాట్‌స్టార్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టేడియంలో మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు ఎంట్రీ పూర్తిగా ఉచితం. ఈ టోర్నమెంట్ స్థానిక క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>