పండ్లు ఆరోగ్యమే.. కానీ ఈ సమయంలో తింటే ప్రమాదమే!

కలం, వెబ్‌ఎస్క్: సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, వాటిని తినే సమయాన్ని (Eating Fruits) బట్టి మన శరీరంపై చూపే ప్రభావం మారుతుందని మీకు తెలుసా? అవును, ఎప్పుడు పడితే అప్పుడు పండ్లను తినడం వలన అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చాలా మందికి రాత్రి భోజనం తర్వాత పండ్లు తినే అలవాటు ఉంటుంది. అసలు ఈ అలవాటు మంచిదేనా? డిన్నర్ తర్వాత పండ్లు తినడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని ఎప్పుడు తింటున్నామనేది కూడా అంతే ముఖ్యమట. రాత్రి భోజనం తర్వాత పండ్లు తినే అలవాటు ఉన్నవారిలో కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అవేమిటంటే.. జీర్ణక్రియ మందగించడం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదని చెబుతున్నారు.

రాత్రి సమయంలో భారీగా భోజనం చేసిన తర్వాత జీర్ణాశయం ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో మనం పండ్లు తినడం వల్ల అవి ఎక్కువసేపు కడుపులో ఉండి కొందరిలో కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా పండ్లలో ఉండే సహజ చక్కెరలు త్వరగా జీర్ణం అవుతాయి. కానీ భారీ భోజనం తర్వాత పండ్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే జీర్ణక్రియలో నిమగ్నమై ఉన్న జీర్ణాశయంపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల గ్యాస్ ఏర్పడటం, కడుపునిండిపోయిన భావన, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే రాత్రి పూట పండ్లు తినాలనుకునేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
రాత్రి భోజనానికి, పండ్లు తినడానికి మధ్య కనీస సమయం గంట నుంచి 2 గంటలు ఉండాలట. భోజనం తర్వాత ఎక్కువ మొత్తంలో కాకుండా కేవలం ఒక చిన్న కప్పు లేదా కొన్ని ముక్కలు మాత్రమే తీసుకోవడం కొంత వరకు బెటర్. అంతే కాకుండా రాత్రి పండ్లు తినేటప్పుడు తక్కువ ఆమ్లత్వం, తక్కువ చక్కెర స్థాయిలు ఉన్న పండ్లను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు.. బొప్పాయి, కివీ, ఆపిల్ వంటివి.

పండ్లు తినడానికి సరైన సమయం ఏది?

1. ఉదయం పరగడుపున
ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీరు తాగి, పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలో పండ్లు తీసుకోవడం వలన శరీరం పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ను చాలా వేగంగా గ్రహిస్తుందట.

2. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు లంచ్‌కు మధ్య
ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల మధ్య పండ్లు తినడం వలన జీర్ణక్రియ రేటు పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

3. సాయంత్రం స్నాక్స్ సమయం
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల మధ్య పండ్లు తీసుకోవడం మంచి సమయంగా చెబుతున్నారు నిపుణులు. సాయంత్రం సమోసాలు, బిస్కెట్లకు బదులుగా పండ్లు తినడం వలన శరీరంలోకి అనారోగ్యకరమైన కేలరీలు చేరకుండా ఉంటాయట.

(Note: ఈ సమాచారం కేవలం మీ ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీన్ని ఎలాంటి వైద్య సలహాగా పరిగణించకూడదు. మీ డైట్ లో మార్పులు చేసుకునే ముందు ఖచ్చితంగా వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>