ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: జ్యోతిక

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు ఉదృతమవుతున్న తరుణంలో ప్రముఖులు ఒక్కక్కరిగా తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై స్టార్ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక (Actress Jyotika) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను విద్యార్థులు, దేశ భవిష్యత్ తరఫున నిలబడతానని స్పష్టం చేశారు. ఒక తల్లిగా తమ పిల్లలను సామజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే, సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ లాగా పెంచాలని అభిప్రాయపడ్డారు. తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న జెన్ జీ (Gen Z) యువత పట్ల పట్ల గర్వంగా ఉందని రాసుకొచ్చారు. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ.. జై హింద్ అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>