Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ అస‌లు రెడ్డి కాదు: ధ‌ర్మ‌పురి అర్వింద్‌

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ అస‌లు రెడ్డి కాదంటూ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. నిజామాబాద్‌లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ధ‌ర్మ‌పురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిపై శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. రేవంత్ సీఎం రేవంత్ నిజామాబాద్‌కు వ‌చ్చి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై శ్ర‌ద్ధ లేదు కానీ ప్ర‌శ్నిస్తున్న‌ ప్ర‌త్య‌ర్థుల‌పై ఇష్టారీతిన మాట్లాడుతున్నార‌ని చెప్పారు. రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ల‌పై జోకులు వేస్తున్నార‌ని, ద‌మ్ముంటే ముస్లిం దేవుళ్ల‌పై సెటైర్లు వేయాల‌ని స‌వాల్ విసిరారు.

రేవంత్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం తన వ్యక్తిత్వాన్ని అమ్ముకొని కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుతున్నాడని, వ్యక్తిత్వాన్ని అమ్ముకున్న వాడు రెడ్డి ఎలా అవుతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిర‌మ్మ ఇండ్లు, పెన్ష‌న్లు, తులం బంగారం హామీలు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. నెల‌కు రూ. 2,500 ఇస్తామ‌ని ఎగ్గొట్టార‌న్నారు. యువ‌త‌కు రూ. 4,000 నిరుద్యోగ భృతి అన్నారు కానీ అదీ ఇవ్వ‌లేద‌న్నారు. ఫీ రీయింబ‌ర్స్ మెంట్ కూడా ఎగ్గొట్టార‌ని చెప్పారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల‌కు ప్ర‌జ‌లు ఓటుతో బుద్ధి చెప్పాల‌ని ఎంపీ అరవింద్ (Dharmapuri Arvind) పిలుపునిచ్చారు.

Read Also: బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: కవిత సంచలన ఆరోపణ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>