epaper
Wednesday, February 18, 2026
epaper

దొంగ హామీలతో కాంగ్రెస్​ మోసం : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల (Gajwel Municipal Elections) ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టకపోగా, కనీసం ఉన్న రోడ్లను కూడా బాగు చేయలేదని ధ్వజమెత్తారు.

గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం హయాంలోనే పెన్షన్ల పెంపు జరిగిందని, అప్పట్లో ఉన్న 200 రూపాయల పెన్షన్‌ను కేసీఆర్ 2 వేల రూపాయలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని ఆశ చూపిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని ఆరోపించారు. అదేవిధంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదని, కాంగ్రెస్ మాటలన్నీ నీటి మూటలేనని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు.

Read Also: బీజేపీ బీఫామ్‌లు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>