కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకినీడులో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆకినీడు రామాలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishnam Raju)ను ఓ వర్గం వారు అడ్డుకున్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆకివీడులో రామాలయానికి సంబంధించి చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ రామాలయాన్ని పున: నిర్మిస్తామని రఘురామకృష్ణం రాజు గతంలో పేర్కొన్నారు. అయితే ఆ స్థలం తమ ప్రార్థనాస్థలానికి చెందినదని మరో వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఘర్షణ మొదలైంది.
శ్రీరామనవమి సందర్భంగా ఆకినీడు రామాలయంలో పూజలు చేసేందుకు రఘురామకృష్ణంరాజు వెళ్లగా మరోవర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఆకివీడు పెద్దపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఈ ఘర్షణల్లో ఇద్దరు గాయపడగా వారిని భీమవరం ఆస్పత్రికి తరలించారు.
Read Also: మన ఆడబిడ్డకు అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజకీయాల్లో హన్మకొండ మహిళ
Follow Us On : WhatsApp

