Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్.. అవసరమైతే మళ్లీ యుద్ధం

కలం, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా మధ్య స్విట్జర్లాండ్ వేదికగా మరో రెండు రోజుల్లో చారిత్రాత్మక ఒప్పందం కుదిరే వేళ అధ్యక్షుడు ట్రంప్ (Trump) మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఒప్పందం నుంచి టెహ్రాన్ ఏమాత్రం వెనక్కి వెళ్లినా.. యుద్ధం ఖాయమని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో మళ్లీ కంగారు మొదలైంది. తాము పెట్టిన అన్ని షరతులకు ఇరాన్ అంగీకరించినందని ఓ వైపు అమెరికా చెప్పుకుంటోంది. ఇరాన్ మాత్రం, తమకు సమ్మతం అయితేనే ముందుకు వెళతామని తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒప్పందం రోజు ఏం జరుగుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అవును.. ఒప్పందం ఇంకా ఫైనల్ కాలేదు..

ఫ్రాన్స్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరాన్‌తో చేసుకోబోతున్న ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఒప్పందం ఇంకా ఫైనల్ కాలేదని, కాకపోతే అది జరిగేలా అద్భుతమైన డీల్ చేసుకున్నట్లు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. దీనిపై ఇరు దేశాల వారు సంతోషంగా ఉన్నారని వివరించారు. ఇరాన్ వెనక్కి వెళితే ఆ దేశమే మళ్లీ నష్టపోతుందని, అయితే.. అక్కడ తెలివైన నాయకత్వం ఆ పని చేస్తుందని తాను అనుకోవడం లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

Read Also: చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. ముహూర్తం ఖరారైందా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>