కలం, డెస్క్ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారుల సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ కొందరు అధికారులు వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.. అది మంచిది కాదు. పని విషయంలో నేను సీరియస్ గానే ఉంటా. నాకు పొగడ్తలు వద్దు. పని కావాలి. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరిస్తూ పనిచేయాలి. వైసీపీ నేతలకు అనుకూలంగా పనులు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Read Also: సమాజసేవకు విరాళాలు ఇవ్వాలి : సీఎం చంద్రబాబు
Follow Us On: Pinterest


