డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ అవార్డుల పంట

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్(Panchayat Raj) శాఖ జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచింది. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను (National Awards) అందుకొని  రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. డిప్యూటీ  సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలో ఈ శాఖ అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటీవల కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ అవార్డులు గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల సమర్థవంతమైన అమలు వంటి కీలక రంగాలలో రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయి.

గతంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. గ్రామస్థాయి పాలనను బలోపేతం చేయడం, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం వంటి అంశాలలో పంచాయతీరాజ్ శాఖ గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఈ ఐదు జాతీయ పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వ కృషికి గుర్తింపుగా నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక సంస్థల సామర్థ్య పెంపు, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోంది.

Read Also: ఆ విషయంలో జగన్ క్రెడిట్ ను చోరి చేయలేరు: కొల్లు రవీంద్ర

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>