Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ విషయంలో జగన్ క్రెడిట్ ను చోరి చేయలేరు: కొల్లు రవీంద్ర

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్.. జగన్‌ది వినాశనం, అవినీతి క్రెడిట్ అని వ్యాఖ్యానించారు. ఇక జగన్ క్రిమినల్ క్రెడిట్‌ను ఎవ్వరూ చోరీ చేయలేరని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి, పిన్నమ్మ మెడలో తాళి తెంచిన హంతకులకు జగన్ అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. బాబాయి హత్య కేసులు జగన్ ఆడించిన డ్రామాల క్రెడిట్‌ను ఎవ్వరూ కోరుకోరని.. సొంత తల్లి, చెల్లిని రోడ్డున పడేసిన క్రెడిట్ జగన్‌ది అని చెప్పుకొచ్చారు. జగన్ తన అక్రమార్జన కోసం నకిలీ మద్యం ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం తలపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నా.. వాటి క్రెడిట్‌ను కొట్టేసే పనిలో జగన్ రెడ్డి ఉన్నాడని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ బాబు కృషి వలనే ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. ఆ కంపెనీతో నేనే మాట్లాడాను.. నేను తెచ్చిన కంపెనీలే ఇవి అంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు బ్రాండ్ వలన రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్ వంటి గొప్ప సంస్థలు వస్తున్నాయని.. జగన్ తరిమేసిన సంస్థలను కూడా తాము తిరిగి తెస్తున్నట్లు వివరించారు.

అమరావతిపై వైసీపీ నేతలకు ఎందుకంత విద్వేషమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకున్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి జగన్ అడ్డుపడి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ఉద్యమం చేసిన రైతులపై దాడులు చేశారని మండిపడ్డారు. జగన్ చర్యల వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని .. తమ కూటమి ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రస్తుతం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేసి.. రాజకీయ లబ్ది చేకూర్చుకోవాలని చూస్తున్నారని చెప్పారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>