మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట : పోచారం శ్రీనివాస్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ రవి కుమార్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం విజయవంతంపై సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు, రూ. 10,000 కోట్లు ఆదా చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మీ పథకం ప్రారంభించిందన్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికులు సుమారుగా 290 కోట్లు కాగా రూ.10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ప్రారంభమయిన నుండి 30 మార్చి 2026 వరకు బాన్సువాడ డిపోలో ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికులు 2.42 కోట్లు కాగా ప్రయాణికులు ఆదా చేసుకున్న మొత్తం రూపాయలు 90.32 కోట్లు అని తెలిపారు. రూ 10,000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Read Also: కరీంనగర్‌లో మైనింగ్ స్కామ్.. ట్యాక్స్ ఎగ్గొట్టి దోచేస్తున్న కంపెనీలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>