విద్యకు పెద్ద పీట : డిప్యూటీ సీఎం

కలం, ఖమ్మం బ్యూరో : ఇందిరమ్మ రాజ్యం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర (Madhira) నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం ఖమ్మంలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని, హాస్టల్ బిల్డింగ్ లను, కంప్యూటర్ లాబ్స్ ను పరిశీలన చేశారు.

నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ విషయంలో రాజీ పడవద్దన్నారు. ఇవి కేవలం భవనాలు కాదు భావితరాలను ఉజ్వలంగా తయారు చేసే దార్శనిక దేవాలయాలుగా ఆయన (Deputy CM Bhatti) అభివర్ణించారు. అలాగే మధిర మండలం సిరిపురంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, ఐటిఐ భవనాలను పరిశీలన చేశారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అధికారులతో అక్కడికక్కడే సమీక్ష జరిపారు. నిర్మాణ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

Read Also: వడ్లు కొంటలేరు.. పంట మార్పిడి చేయండి : సీఎం రేవంత్

Follow Us On: Youtube

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>