కలం, వెబ్ డెస్క్: చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో ఇమడలేనని స్పష్టం చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. ఈ నెల 25న పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం పార్టీలో ఇమిడే పరిస్థితి లేదని చెప్పారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమిటెడ్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు.
నా సమస్యకు పరిష్కారం చూపలేదు
తన సమస్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తాను అనేక సందర్భాల్లో చెప్పినా పార్టీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం తాను ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఫలించని బుజ్జగింపులు
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేతో తనకు సమస్య ఉందని జీవన్ రెడ్డి శ్రీధర్ బాబుకు చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ కీలక నేతలు బుజ్జగించినా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. మరి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో వేచి చూడాలి. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల నుంచి జీవన్ రెడ్డి ఆహ్వానాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ఏ పార్టీలో చేరుతారో వేచి చూడాలి. మొత్తానికి నాలుగు దశబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వివిధ హోదాల్లో పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనుండటం గమనార్హం.

