విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం: భట్టి విక్రమార్క

కలం, వెబ్ డెస్క్: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రజాభవన్ లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు వారి సమస్యలపై డిప్యూటీ సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు విద్యుత్ డిస్కమ్స్‌ను (DISCOM) ప్రైవేటుపరం చేస్తారన్న ప్రచారం జరుగుతుందని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు, ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ డిస్కమ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని, అసత్య ప్రచారాలను ఖండించాలని సూచించారు. ఇంధన శాఖ దీర్ఘకాలం కొనసాగాలని అందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగుల జేఏసీ, అధికారులపై ఉందని తెలిపారు. 1912కు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేసి మెరుగైన సేవలకు విద్యుత్ సంస్థలు చిరునామాగా నిలవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఇతర అంశాలు విని పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలకు ప్రతినెల ఒక గంటపాటు సమయం ఇచ్చేలా విద్యుత్ సంస్థల ఉన్నత అధికారులను ఆదేశిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

మూడవ డిస్కం ఏర్పాటు ఉద్యోగుల సర్దుబాటు, 2026 PRC, 2004 వరకు నియామకమైన వారికి పాత పెన్షన్స్ స్కీమ్ అమలు, రెగ్యులర్ ప్రమోషన్స్, రిక్రూట్మెంట్స్, ఆర్టిజన్ సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ భట్టికి (Bhatti Vikramarka) వినతి పత్రం అందించింది. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, సదానందం, స్వామి, రమేశ్, అశోక్, సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, దయానంద్, శివశంకర్, జనప్రియ, మల్లయ్య, ప్రమోద్ పాల్గొన్నారు.

Read Also: మళ్లీ టీఆర్ఎస్… కేటీఆర్ మాటల వెనుక మర్మమేమిటి?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>