కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవాప్యంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా తీవ్ర పొగమంచు, వాయు కాలుష్యం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంగళవారం దట్టమైన పొగమంచు శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్ట్‌ను కమ్మేసింది. దీంతో పలు విమానాల సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, చండీగఢ్, విశాఖ వెళ్లే విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అలాగే ఢిల్లీ, ఇతర ముఖ్య నగరాల్లో పొగమంచు కారణంగా పలు విమానాలు (Flights), రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: రష్మిక-విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ జరిగేది అక్కడే!
Follow Us On: Youtube


