కడ్తాల్‌లో డెంగ్యూ అలర్ట్.. ప్రజలకు వైద్య సిబ్బంది కీలక సూచనలు!

కలం, సోన్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్న (Dengue Outbreak) నేపథ్యంలో గ్రామపంచాయతీ యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం సర్పంచ్ గుర్రం రాము ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక పారిశుధ్య, వైద్య చర్యలు చేపట్టారు. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఇంటింటికీ వెళ్లి మందులు అందజేశారు.

అంతేకాకుండా బాధితుల ఇళ్లలో దోమల నివారణకు మందులను పిచికారీ చేయించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ నియంత్రణకు గ్రామస్థులు సహకరించాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>