కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో జనగణన-2027 (Telangana Census) నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర గెజెట్‌లో పునరుద్ధరిస్తూ జనాభా లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ షెడ్యూల్ ప్రకారం ప్రత్యక్షంగా ఇళ్లకు వెళ్లి నిర్వహించే జనగణన (Telangana Census) ప్రక్రియ 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది. క్షేత్రస్థాయి లెక్కింపునకు ముందే, పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా 2027 జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత మార్చి 1 నుంచి మార్చి 5 వరకు సవరణకు అవకాశం కల్పిస్తారు.
Also Read : బియ్యం నో స్టాక్ బోర్డులు.. ప్రభుత్వం సీరియస్!
Follow Us On : WhatsApp

