కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్​

కలం, ​కరీంనగర్ బ్యూరో: ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ (Karimnagar Collectorate) భవనాన్ని వైభవంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. సీఎం పర్యటన, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.​

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా భద్రతా ఏర్పాట్లు చేయాలని, విధులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లను ఆదేశించారు. అనంతరం నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రదేశాన్ని, హెలిప్యాడ్, కలెక్టర్ ఛాంబర్‌తో పాటు సీఎం పర్యటించే మార్గాలను స్వయంగా పరిశీలించారు.​ కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం నూతన కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తారని మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్తారని తెలిపారు. పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతీ శాఖ అధికారి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.​ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>