ఇందిరమ్మ ఇంట్లో మంత్రి దీపావళి వేడుకలు

కలం, మెదక్ బ్యూరో: హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం వింజపల్లి (Vinjapalli) గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పర్యటించారు. గ్రామానికి చెందిన పారునంది శంకరవ్వకు మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం శంకరవ్వ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం ద్వారా పేదలకు సొంతింటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందని మంత్రి తెలిపారు.

అదనంగా మరో 2 వేల ఇళ్లు..

మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చేయగా, ప్రస్తుతం అదనంగా మరో 2 వేల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వివరించారు. అత్యంత నిరుపేదలు, అర్హులైన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వకపోవడం వలనే నేడు అర్హులైన లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి విమర్శించారు. త్వరలోనే నియోజకవర్గానికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

Also Read : ఉద్యోగుల సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>