సీనియర్లకు టీమిండియా రెస్ట్.. న్యూజిలాండ్‌కు కొత్త జట్టు!

క‌లం, స్పోర్ట్స్: 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత హాకీలో (India Hockey Squad) మార్పులు మొదలయ్యాయి. న్యూజిలాండ్ పర్యటన కోసం హాకీ ఇండియా సోమవారం 20 మందితో కూడిన యువ జట్టును ప్రకటించింది. జాతీయ జట్టు తరఫున ఆడుతున్న సీనియర్లకు విశ్రాంతినిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ కప్, ఆసియా గేమ్స్, ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీల్లో వరుసగా ఆడిన సీనియర్ జట్టుకు విశ్రాంతి అవసరమని హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ముందుగానే చెప్పారు. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్‌లకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు.

ఈ క్రమంలో నవంబర్ 19 నుంచి 22 వరకు జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు డిఫెండర్ సంజయ్ నాయకత్వం వహించనున్నారు. ఇటీవల ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు నుంచి విష్ణుకాంత్ సింగ్, అంగద్ బీర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగేలకు మాత్రమే ఈ పర్యటనలో చోటు దక్కింది. మిగతా స్థానాల్లో అండర్-21 మరియు ఇండియా ‘ఎ’ జట్టుకు చెందిన ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.

న్యూజిలాండ్‌తో వారి సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లు యువ ఆటగాళ్లకు మంచి సవాలుగా మారుతాయని కోచ్ ఫుల్టన్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుకునేందుకు యువకులకు ఇది గొప్ప అవకాశమని చెప్పారు. 1926లో మేజర్ ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని భారత సైనిక హాకీ జట్టు తొలిసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ చారిత్రాత్మక ఘటనకు 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 19న తొలి టెస్ట్, 21న రెండో టెస్ట్, 22న మూడో టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భవిష్యత్తు కోసం యువ రక్తాన్ని సిద్ధం చేసే దిశగా భారత హాకీ వేస్తున్న ఈ అడుగులు కీలకం కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>