కలం, వెబ్ డెస్క్ : దానం నాగేందర్ (Danam Nagender) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ప్రాథమిక దశలోనే కొట్టివేసిందని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు (Gandra Mohan Rao) తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున బీ-ఫామ్ కూడా అందుకోవడమనేది స్పష్టమైన పార్టీ ఫిరాయింపు చర్య అని ఆయన స్పష్టం చేశారు.
కోర్టుల దాకా రాకుండా అసెంబ్లీ స్పీకరే మొదట్లోనే దీనిపై తగిన నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని, కానీ స్పీకర్ నిర్ణయంలో ఆలస్యం చేశారని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతే విచారణ చేపట్టినప్పటికీ, దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించడం సరికాదన్నారు. స్పీకర్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయగా, హైకోర్టు స్పందించి ఆయనపై అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చిందని తెలిపారు. ఆ తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ (Danam Nagender) సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలి పిటిషన్ డిస్మిస్ అయిందని గండ్ర మోహన్ రావు వివరించారు.
Also Read : తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు
Follow Us On: X(Twitter)

