బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ‘ఛోటా భీమ్’: ECI వినూత్న నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఈ పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం (ECI) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా యువతను, తొలిసారి ఓటు వేసే ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు ఆకర్షించడానికి ప్రముఖ యానిమేషన్ పాత్ర ఛోటా భీమ్‌ (Chhota Bheem)ను రంగంలోకి దించుతోంది.

చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే ఛోటా భీమ్ (Chhota Bheem) పాత్ర ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని ఈ యానిమేషన్ పాత్ర ద్వారా ప్రచారం చేయనున్నారు. సామాజిక మాధ్యమాలు, టెలివిజన్ ప్రకటనలు, బహిరంగ ప్రదేశాల్లోని హోర్డింగ్‌ల ద్వారా ఛోటా భీమ్ ఓటర్లకు అవగాహన కల్పించనుంది.

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యువతకు చేరువయ్యేందుకు సంప్రదాయ పద్ధతులతో పాటు ఇటువంటి సృజనాత్మక మార్గాలను ఎంచుకోవడం విశేషం. ఈ ప్రచారం క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>