కలం, వెబ్ డెస్క్: ఓ వైపు వాయుకాలుష్యం(Air Pollution), మరోవైపు పొగమంచు ప్రభావంతో ఢిల్లీ(Delhi) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత రోజురోజుకు తీవ్రంగా పడిపోతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సోమవారం ఉదయం 8.30 గంటలకు జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలకు ఆయన వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పర్యటన పోస్ట్ పోన్ అయ్యింది.
ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ప్రయాణించే విమానం నిర్ణీత సమయానికి వెళ్లలేకపోయారని తెలుస్తోంది. పొగమంచుతో ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలను బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల టేకాఫ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. దీంతో ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప జాప్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ (PM Modi) విదేశీ పర్యటనలో భాగంగా దౌత్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రయాణం ఆలస్యం కావడంతో తదుపరి కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Also: బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్
Follow Us On: Pinterest


