epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్

కలం డెస్క్ : వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ (Assembly Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాదాపు 58 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా (Voter List) నుంచి మిస్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని అర్హత లేనివారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ నెల 4వ తేదీ నుంచి 11 వరకు వారం రోజుల పాటు ‘సర్’ (SIR) చేపట్టింది. అడ్రస్ మారినవారు, మరో చోటికి వెళ్ళిపోయినవారు, చనిపోయినవారు, అసలు ఆ ప్రాంతంలోనే లేనివారు.. ఇలా వివిధ కేటగిరీల కింద మొత్తం 58.20 లక్షల మంది పేర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొన్నది. ఆ రాష్ట్రంలోని మొత్త ఓటర్ల (7.66 కోట్లు)లో ఇది దాదాపు 7.6% అని ఈసీ తెలిపింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిచ్చు రేపినట్లుగానే ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో సైతం ‘సర్’ ప్రక్రియ సంచలనంగా మారింది.

అభ్యంతరాలను స్వీకరించేందుకు షెడ్యూల్ :

పశ్చిమబెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈసీ తీసుకున్న చర్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (AITC) ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఓటర్ల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుందని గ్రహించి ఈసీ.. వారి నుంచి అభ్యంతరాలను, ఫిర్యాదులను తీసుకునేందుకు షెడ్యూలు రూపొందించింది. ఇప్పటివరకు తొలగించిన ఓటర్ల వివరాలను ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమెయిన్‌లో పెడతామని, డిసెంబరు 16 నుంచి చూసుకోవచ్చని తెలిపింది. పేర్లు మిస్ అయినవారు ఈ నెల 16 నుంచి జనవరి 17వ తేదీ వరకు ఈసీకి ఫిర్యాదు చేసి అర్హులైన ఓటర్లుగా తెలిపేందుకు తగిన ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నది. అలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులను జనవరి 7 వరకు మాత్రమే సమర్పించుకునే వెసులుబాటు ఉన్నది. వాటిని పరిశీలించి జనవరి 17 వరకు దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నది.

ఫిబ్రవరిలో తుది జాబితా :

ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించి ఫిబ్రవరిలో తుది జాబితాను ఈసీ ఖరారు చేయనున్నది. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా చూస్తున్నది. ఇప్పటివరకు ఈసీ సమర్పించిన స్టేటస్ రిపోర్టు ప్రకారం ఓటర్ల నుంచి దాదాపు 31.39 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని కూడా పరిష్కరిస్తామని స్పష్టత ఇచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలు, ప్రజల నుంచి వచ్చినట్లుగానే పశ్చిమ బెంగాల్‌లో సైతం ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి పోరాట వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ‘ఓట్ చోరీ’ (Vote Chori) అంటూ కాంగ్రెస్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన రోజునే ఈసీ పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల మంది పేర్లను తొలగించినట్లు స్టేటస్ రిపోర్టును విడుదల చేయడం గమనార్హం.

Read Also: ఇది బిహార్ కాదు, తమిళనాడు: అమిత్‌షాకు స్టాలిన్ కౌంటర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>