కెన్‌-బెత్వా ఆందోళ‌న‌పై పోలీసుల ఉక్కుపాదం!

క‌లం, వెబ్‌డెస్క్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కెన్‌-బెత్వా న‌దుల అనుసంధాన ప్రాజెక్టు (Ken Betwa Project) కు వ్య‌తిరేకంగా ఛ‌త‌ర్‌పూర్‌, ప‌న్నా జిల్లాల్లోని ఆదివాసీలు చేస్తున్న నిర‌స‌న‌ల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిర‌స‌న జ‌రుగుతున్న ప్ర‌దేశానికి చేరుకొని ఆదివాసీల‌ను చెద‌ర‌గొట్టారు. గ‌త ప‌దిహేను రోజులుగా ఈ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. జల్ సత్యాగ్రహం, చితా సత్యాగ్రహం, ఫాన్సీ సత్యాగ్రహం పేరుతో ఆదివాసీలు విభిన్న రీతిలో నిర‌స‌న‌లు చేప‌ట్టారు.

దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ప్రాజెక్టుతో (Ken Betwa Project) నిరాశ్ర‌యుల‌వుతున్న త‌మ‌కు పున‌రావాసం క‌ల్పించాల‌ని, త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్లు నెర‌వేర్చాల‌ని వారు కోరుతున్నారు. ఈ నిర‌స‌న‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తూ, ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా అమిత్ భట్‌నాగర్ నిరవధిక దీక్ష చేస్తున్నారు. పోలీసులు ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేసి బలవంతంగా అక్క‌డి నుంచి తరలించారు.

Read Also: అడవిని గెలిపించిన జనం: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>