కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Policy Case)పై నేడు ఢిల్లీ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ప్రతివాదులందరూ తమ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత (Kavitha), అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులందరికీ క్లీన్ చిట్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్ట్‌లో సవాల్ చేసింది.అనంతరం హైకోర్ట్ ఆదేశాలతో సీబీఐ కవితతో పలువురికి మార్చి 12న మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని బెంచ్ సీబీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టి, ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.
సీబీఐ తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. క్లీన్ చిట్ వచ్చిన 23 మందికి నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు వెల్లడించారు. ప్రతివాదులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి 4 వారాల సమయం కోరారు. కాగా, కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్ట్ 3 వారాల సమయం ఇచ్చింది.
Read Also: పరిపాలన కోసం విప్లవాత్మక పాలసీలు : గవర్నర్
Follow Us On : WhatsApp

