క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఏనుగు.. ఉత్త‌రాఖండ్‌లో అరుదైన ఘ‌ట‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌ (Jim Corbett National Park)లో ఒక అరుదైన ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. పార్క్‌లోని గర్జియా పర్యాటక ప్రాంతంలో ఒక ఆడ ఏనుగు రెండు ఆరోగ్యకరమైన కవల పిల్లలకు (Twin Elephant Calves) జన్మనిచ్చింది. సాధారణంగా ఏనుగులు ఒకే ఒక పిల్లకు జన్మనిస్తాయని, ఇలా కవలలు పుట్టడం వందలో ఒక శాతం మాత్రమే జరుగుతుందని వన్యప్రాణి నిపుణుడు సత్‌ప్రీత్ సింగ్ శెట్టి తెలిపారు. దాదాపు 22 నుండి 24 నెలల సుదీర్ఘ గర్భధారణ కాలం తర్వాత ఏనుగు కవలలకు జన్మనివ్వడం, వాటిని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా సవాలుతో కూడుకున్నవిషయమని నిపుణులు పేర్కొంటున్నారు.

వైల్డ్‌లైఫ్ ప్రేమికుడు సంజయ్ ఛిమ్వాల్ జంగిల్ సఫారీ చేస్తుండగా ఈ ఏనుగుల కుటుంబాన్ని మొదటిసారిగా గుర్తించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ రెండు ఏనుగు పిల్లలు తమ తల్లితో సురక్షితంగా ఉంటూ పాలు తాగుతూ కనిపించాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ప్రస్తుతం పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

ఈ అరుదైన జననం కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణులకు అందుతున్న సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణానికి నిదర్శనమని పార్క్ డైరెక్టర్ సాకేత్ బడోలా తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోనే అత్యధికంగా 1,200కు పైగా ఏనుగులు కార్బెట్ ప్రాంతంలోనే నివసిస్తున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న పరిరక్షణ చర్యలు, అడవుల్లో తగినంత ఆహారం, అనుకూలమైన వాతావరణం వల్లే ఏనుగుల జనాభా వృద్ధి చెందుతోందని అటవీ అధికారులు వెల్లడించారు. కవల పిల్లలు (Twin Elephant Calves) పుట్టిన నేపథ్యంలో తల్లి ఏనుగుకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు గర్జియా జోన్‌లో నిఘాను పెంచారు. పర్యాటకులు లేదా ఇతరుల వల్ల వాటికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్ల‌డించారు.

Read Also: తీర్థయాత్రకు వెళుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>