కత్తితో పొడిచి, గొంతుకోసి.. భార్యను చంపిన భర్త

కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు (Patancheru)లో దారుణం చోటు చేసుకుంది. పఠాన్​ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని APR laxuriya గేటెడ్ కమ్యూనిటీ ఫేస్ – 1, Villa No – 94 లో ఓ భర్త భార్యపై పలుసార్లు కత్తితో పొడిచి అనంతరం గొంతు కోసి దారుణంగా చంపేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబటి లీలావతి (60) ని భర్త అంబటి పరమేశ్వర్ రావు (70) కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గత కొంతకాలంగా మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్న పరమేశ్వర్​.. ఇంట్లో కొడుకు, కోడలు.. ఎవ్వరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుందా.. అయితే బీఅలర్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>