Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీలో ప్రమాదం.. అదుపు తప్పి బోల్తా పడిన బస్సు

కలం, వెబ్​ డెస్క్​ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో అర్ధరాత్రి వేళ రోడ్డు ప్రమాదం సంభవించింది. కరోల్ బాగ్‌లోని ప్రసిద్ధ ఝండేబాలన్ ఆలయ సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పల్టీ కొట్టింది. హనుమాన్ మందిర్ చౌక్ వద్ద రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఈ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.

అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందా లేక ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Read Also: సరిహద్దుల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్: నిందితుల అరెస్ట్

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>