Mobile Popup Ad
Mobile Popup Ad

విజ‌య‌వాడ‌లో ట్రైన్‌లో గంజాయి.. ఎనిమిది మంది అరెస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: విజ‌య‌వాడ‌ (Vijayawada)లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో రైలులో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌, ఈగ‌ల్ టీం బృందాలు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల‌ను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించి విచార‌ణ చేప‌ట్టారు. అస‌లు గంజాయి ఎక్క‌డి నుంచి కొనుగోలు చేశారు, దీన్ని ఎక్క‌డెక్క‌డికి స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌న్న దానిపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక పెద్ద ముఠా ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏపీ నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌ట్టుబ‌డ్డ వారంతా ఇతర రాష్ట్రాల‌కు చెందిన వారేన‌ని స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>