సరిహద్దుల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్: నిందితుల అరెస్ట్

కలం, వెబ్​ డెస్క్​ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ స్థాయి అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ (Arms Smuggling) ముఠాను ఛేదించారు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో సంబంధాలు కలిగి ఉన్న ఈ ముఠా, పాత ఢిల్లీ ప్రాంతం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యూహాత్మకంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ఆయుధ అక్రమ రవాణాకు సంబంధించి పది మంది కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. సబ్‌మెషిన్ గన్లు, పీఎక్స్-5.7 పిస్టల్స్, పీఎక్స్-3 పిస్టల్స్, షాడో సీజెడ్, బెరెట్టా, టారస్, వాల్తర్ వంటి మొత్తం 21 అత్యాధునిక విదేశీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వీటిలో పీఎక్స్-5.7 అనే పిస్టల్ కేవలం ప్రత్యేక దళాలు మాత్రమే ఉపయోగించే రకం కావడం గమనార్హం. ఈ ఆయుధాలన్నీ పాకిస్థాన్ నుండి నేపాల్ సరిహద్దుల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi – NCR) ప్రాంతంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో క్రిమినల్ గ్యాంగులకు ఈ ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర సూత్రధారుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Read Also: పెట్రోల్‌, గ్యాస్‌, యూరియా నిల్వ‌ల‌పై నేడు సీఎం స‌మీక్ష‌

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>