కలం వెబ్ డెస్క్ : వెనెజువెలా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా బలగాలు అరెస్టు చేసిన నేపథ్యంలో దేశ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్(Delcy Rodríguez)ను తాత్కాలిక అధ్యక్షురాలి(Interim President)గా బాధ్యతలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కోర్టు కాన్‌స్టిట్యూషనల్ చాంబర్ జారీ చేసిన తీర్పులో మదురో లేని పరిస్థితుల్లో డెల్సీ రోడ్రిగెజ్ వెనెజువెలా బొలివేరియన్ రిపబ్లిక్ అధ్యక్షురాలి బాధ్యతలను స్వీకరించి, పరిపాలనా కొనసాగింపు, దేశ రక్షణను నిర్ధారించాలని పేర్కొంది. అమెరికా బలగాలు(US forces) శనివారం తెల్లవారుజామున మదురోను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మదురో, ఆయన భార్యకు తరలించారు. ఈ ఘటనపై కోర్టు మరింత చర్చించి పరిపాలన, సార్వభౌమాధికార రక్షణకు సంబంధించి చట్టపరమైన చర్యలను నిర్ణయిస్తుందని తెలిపింది. ఈ పరిణామాలు వెనెజువెలా రాజకీయ అనిశ్చితిని మరింత పెంచాయి.


