కలం వెబ్ డెస్క్ : ఏపీలోని చిత్తూరు(Chittoor) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు ఏడేళ్ల గిరిజన బాలిక(tribal girl)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరి(Nagari)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. నిందితుడు చాక్లెట్ ఆశ చూపి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు(Police) నిందితుడు నాగరాజు(30)ను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేశారు.


