కలం వెబ్ డెస్క్ : వెనిజులా(Venezuela)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ(MEA) కీలక ట్రావెల్ అడ్వైజరీ(Travel Advisory) జారీ చేసింది. వెనిజులాలోని భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ అనవసరపు ప్రయాణాలు చేయవద్దని కోరింది. తాము తిరిగే మార్గాలను పరిమితం చేసుకోవాలని సూచించింది. ఎవరికైనా సమస్యలు ఎదురైతే కరాకస్(Caracas)లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. భారత రాయబార కార్యాయలన్ని సంప్రదించేందుకు cons.caracas@mea.gov.in మెయిల్ ఐడీ, +58-412-9584288 ఫోన్ నంబర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరింది. అమెరికా సైన్యం కరాకస్‌లో భారీ ఎత్తున దాడులు చేపట్టి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro)ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం మదురోతో పాటు ఆయన భార్యను న్యూయార్క్ తరలించారు. కరాకస్‌లో అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో సుమారు 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.


