కలం, వెబ్‌డెస్క్: కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ కొడుకు మహ్మద్ ఇలియాస్ అలీ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally)పై పరువు నష్టం దావా వేశారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్యే రమణారెడ్డి పలుమార్లు ఇలియాస్ అలీపై రేప్ కేసులు ఉన్నాయని, వాటిని బయట పెడతామని ఆరోపించారని ఆయన తరఫు లాయర్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఆయన అసత్యాలు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. రేప్ కేసులతో పాటు ఇలియాస్‌పై ఎలాంటి కేసులు లేవన్నారు. రాజకీయంగా నష్టం చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్యేపై పరువు నష్టం కేసు వేసినట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే కోర్టుకు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిందన్నారు. మే 20న రమణారెడ్డి (MLA Katipally) విచారణ హాజరై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు.
Read Also: మంజీరా నదిలో ఇసుక దోపిడీ మళ్లీ జోరు
Follow Us On: X(Twitter)

