కవితపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ ప్రకటన వేళ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత సొంత తండ్రిని రోబోగా అభివర్ణించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను గౌరవించుకోవాలని హితవు పలికారు. అలాగే రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా పాలన నడుస్తుందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

కుటుంబ గొడవల కారణంగానే కవిత (Kavitha) కొత్త పార్టీ పెట్టుకున్నారని తెలిపారు. పార్టీ పేరు ఏదో చెబుతారు అనుకుంటే.. మళ్లీ పాత పేరు టీఆర్ఎస్ వచ్చేలా కొత్త పార్టీని అనౌన్స్ చేశారని అన్నారు. కవిత పార్టీని ప్రకటించిన వేళ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించి పార్టీ విధానాలను మాత్రమే చెబితే బాగుండేదని ఆయన (Danam Nagender) పేర్కొన్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>