కలం, నిర్మల్: వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ (Rythu Nestham ) 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి వర్చువల్ గా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
అన్ని జిల్లాల, మండల కేంద్రాల్లోని రైతు వేదికల ద్వారా అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. సోన్ మండల రైతు వేదిక నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ‘రైతు నేస్తం’ (Rythu Nestham) కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు.
Read Also: అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెకీ మృతి!
Follow Us On : WhatsApp

