ఫీజు బకాయిలపై బీజేవైఎం మిస్డ్‌కాల్ ఉద్యమం

కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరు బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ మిస్డ్‌కాల్ ఉద్యమం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హాజరయ్యారు.

ఈ సందర్బంగా దినేష్ పటేల్ (Dinesh Patel Kulachari) మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థుల విద్య హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మానుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల ఇందూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు.

అనంతరం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. సంతకాల సేకరణ ద్వారా విద్యార్థుల గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బీజేవైఎం (BJYM), బీజేపీ నాయకులు అమంద్ విజయ్ కృష్ణ, విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్, ఓం సింగ్, సాయి ప్రవీణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also: ఆందోళనకారులపై కంగనా రనౌత్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>